pickle, keera raitha, a1vanta, apurupa recipes,
కావలసినవి
కీరా - పావు కిలో,
పచ్చిమిర్చి - 6,
పెరుగు – అరకిలో,
ఉప్పు - తగినంత,
పసుపు - చిటికెడు
కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు
ధనియాలపొడి - అర టీ స్పూను
తయారి
కీరాలను శుభ్రంగా కడిగి, చిన్నచిన్నముక్కలుగా తరగాలి. పచ్చిమిర్చిని సన్నగా కట్ చేయాలి ? ఒక గిన్నెలో పెరుగు వేసి చిక్కగా చిలకాలి. కీరా ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, పసుపు, కొత్తిమీర తరుగు, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. సుమారు రెండుగంటలు ఊరనివ్వాలి. రోటీలలోకి, అన్నంలోకి రుచిగా ఉంటుంది. శరీరానికి చలవ చేస్తుంది.
