Kadie Chicken, telugu blog, apurupa recipes, a1vanta
కావలసినవి
నానబెట్టేందుకు: చికెన్: కిలో, అల్లంవెల్లుల్లి: టేబుల్‌స్పూను, పసుపు: అరటీస్పూను, గరంమసాలా: టీస్పూను, పెరుగు: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా,
కూరకోసం: ఉల్లిపాయ: ఒకటి, టొమాటో: ఒకటి, టొమాటో గుజ్జు: టేబుల్‌స్పూను, అల్లంవెల్లుల్లి: టేబుల్‌స్పూను, క్యాప్సికమ్: ఒకటి, దాల్చినచెక్క: ఒకటి, పలావు ఆకు: ఒకటి, జీలకర్ర: టీస్పూను, కారం: టీస్పూను, దనియాలపొడి: 2 టీస్పూన్లు, జీలకర్రపొడి: టీస్పూను, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, నిమ్మకాయ: ఒకటి
తయారుచేసే విధానం
చి చికెన్ ముక్కలకు టేబుల్‌స్పూను అల్లంవెల్లుల్లి, పసుపు, గరంమసాలా, పెరుగు, ఉప్పు పట్టించి గంటసేపు నాననివ్వాలి.
బాణలిలో నూనె వేసి జీలకర్ర, దాల్చినచెక్క, పలావు ఆకు వేసి వేయించాలి. ఉల్లిముక్కలు వేసి వేగాక అల్లంవెల్లుల్లి, పసుపు, దనియాలపొడి, జీలకర్రపొడి, గరంమసాలా వేసి కలపాలి. టొమాటో ముక్కలు, టొమాటో గుజ్జు కూడా వేసి కలపాలి. వేగాక నానబెట్టిన చికెన్ వేసి కలపాలి. ఉప్పు సరిచూసి మూతపెట్టి సుమారు పావుగంటసేపు ఉడికించాలి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసి ఉడికించాలి. చివరగా నిమ్మరసం పిండి, కొత్తిమీర తురుము చల్లి దించాలి.
ఇప్పుడు ముప్పావు కప్పు క్రీమ్ వేసి రెండుమూడు నిమిషాలు ఉడికించాలి.
తరవాత నీళ్లు, పాలు పోసి మరిగించాలి. ఇప్పుడు సిమ్‌లో మరో ఐదు నిమిషాలు ఉంచాక చిల్లీసాస్ వేసి కలపాలి. చివరగా పనీర్ ముక్కలు వేసి కలపాలి. మిగిలిన పావు కప్పు క్రీమ్ కూడా వేసి తక్కువ మంటమీద రెండుమూడు నిమిషాలు ఉడికించి కొత్తిమీర చల్లి దించాలి.
