pulusu, a1vanta, apurupa recipes, telugu blog, telugu vantalu
ఉల్లిపాయ - 1,
పచ్చిమిర్చి - 2,
నూనె - తగినంత,
ఎండుమిర్చి - 2,
చింతపండు - కొద్దిగా,
ఉప్పు - తగినంత,
ఆవాలు - టీ స్పూను,
జీలకర్ర - టీ స్పూను,
బెల్లం తురుము - టీ స్పూను,
కరివేపాకు - ఒక రెమ్మ
తయారి
ఉల్లిపాయను చిన్నముక్కలుగా తరగాలి. పచ్చిమిర్చిని పొడవుగా మధ్యకు కట్ చేయాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి, కాగాక ఎండు మిర్చి వేసి వేయించి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. చింతపండును పది నిముషాలు నీటిలో నాన బెట్టి, మూడు కప్పుల గుజ్జు వచ్చేలా తీయాలి. ఉప్పు, ఉల్లితరుగు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి పొడి వేసి కలపాలి. చిన్న బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి పచ్చిపులుసులో కలపాలి. బెల్లం తురుము, కరివేపాకు జతచేసి, బాగా కలిపి సర్వ్ చేయాలి.
