Paneer, a1 vanta, apurupa recipes, telugu blog
కావల్సినవి:
పనీర్- రెండొందల గ్రా, ఉల్లిపాయలు, టమాటాలు - నాలుగు చొప్పున, అల్లంవెల్లుల్లి ముద్ద -చెంచా, వేరుసెనగలు- మూడు చెంచాలు (వేయించి పొడిచేయాలి), పచ్చిమిర్చి ముక్కలు - చెంచా, జీలకర్ర, ధనియాలపొడి- చెంచా చొప్పున, కొబ్బరిపాలు- కప్పు, ఉప్పు, కారం- రుచికి తగినంత, పసుపు- చిటికెడు, నూనె- మూడు చెంచాలు, కొత్తిమీర తరుగు -కొద్దిగా.
తయారీ:
రెండు ఉల్లిపాయల్ని తరిగి మిక్సీలో మెత్తగా చేయాలి. మిగతా రెండింటినీ సన్నగా తరగాలి. టమాటాలను కడిగి ప్యూరీ తయారుచేయాలి. ఇప్పుడు మందపాటి అడుగున్న పాత్రలో నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాలి. అందులో ఉప్పు, పనీర్ ముక్కలు వేసి ఉడికించాలి. చల్లారాక నీళ్లు వంపి పక్కనపెట్టాలి. బాణలిలో నూనె వేడి చేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. ఆ తరవాత ఉల్లిపాయ, అల్లంవెల్లుల్లి మిశ్రమం చేర్చాలి. రెండు నిమిషాలయ్యాక టమాటా గుజ్జు కలపాలి. నూనె పైకి తేలాక ధనియాల పొడి, సెనగపొడి, కొబ్బరిపాలు, పచ్చిమిర్చి ముక్కలు, అరకప్పు నీళ్లు వేసి మూతపెట్టాలి. గ్రేవీ తయారయ్యాక ఉడికించిన పనీర్ ముక్కలు వేయాలి. ఐదునిమిషాలయ్యాక కొత్తిమీర చల్లి దించేస్తే సరిపోతుంది. పనీర్ కొబ్బరి గ్రేవీ పూరీల్లోకి చాలా బాగుంటుంది.